Stock Market: ఆర్థిక సంవత్సరం చివరి రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..! 4 d ago

8K News-28/03/2025 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 72 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడేలో 77,185.62 77,766.70 మధ్య కదలాడింది. చివరికి 191.51 పాయింట్లు నష్టంతో 77,414.92 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 72.60 పాయింట్ల నష్టంతో 23,519.35 వద్ద స్థిరపడింది. 2024-25 చివరలో సూచీలు నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ.. మదుపర్లకు మాత్రం 5 శాతానికి పైగా రెండు సూచీలు ప్రతిఫలాన్ని ఇచ్చాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 7.48 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 5.4 శాతం చొప్పున లాభాలను నమోదు చేశాయి. శని, ఆదివారాలతో పాటు రంజాన్ సందర్భంగా మార్చి 31 మార్కెట్లకు సెలవు.